ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్.. కోటితో భవనం


తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు మంత్రి హరీశ్ రావు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన ఈ రోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఐలమ్మ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఉక్కు మహిళ అని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో  గజ్వేల్‌లో కోటి రూపాయలతో ఐలమ్మ భవనం నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. దీని కోసం రూ. 40 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రజకులు కోసం ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. రజకులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, ఆర్థికంగా ఎదిగేందుకు ఆధునిక టెక్నాలజీతో డ్రైక్లినింగ్, డ్రైయర్స్ వైపు మళ్లాలని సూచించారు. రజకుల కోసం సిద్దిపేటలో ఆధునిక వసతులతో దోబీ ఘాట్ నిర్మించామని, అలాంటి దాన్ని గజ్వేల్ లోనూ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad