టీనేజ్ యువతీయువకులను ప్రధానంగా వేధించే సమస్య ముఖంపై
మొటిమలు.ఈ మొటిమలు పోగొట్టుకోవడం కోసం రకరకాల ఫేస్ క్రీమ్‌లు, ఫేస్
వాష్‌లు ఉపయోగిస్తూ ఫలితం కనిపించక యూత్ తెగ బాధపడుతుంటారు. మొటిమలు మరింత పెరిగి
ముఖం అందవిహీనంగా తయారవుతుందని కలత చెందుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు
పరిష్కార మార్గం ఉందంటున్నారు డెర్మటాలజిస్టులు. ముఖాన్ని గోరు వెచ్చని నీటితో
రోజుకు రెండు నుంచి మూడు సార్లు కడిగితే ముఖంపై మొటిమలు తగ్గుముఖం పడతాయట.
సహజసిద్ధంగా దొరికే ప్రకృతి వనరుల మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల మొటిమలు
తగ్గుతాయట. ముఖంపై రసాయనాలతో కూడిన క్రీమ్స్‌ను పూయడం వల్ల చర్మం మొద్దుబారిపోయే
అవకాశం ఉందని చెబుతున్నారు.