నోరా ఫతేహి లేటెస్ట్ డాన్స్ వీడియో .. ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది గా !!
‘బాహుబలి- ది బిగినింగ్’ సినిమాలో ‘మనోహరి’ పాట ఎంత హిట్టో అందరికి తెలిసిందే. ఆ సాంగ్ లో వయ్యారాలుపోతూ డ్యాన్స్ చేసింది మరెవరో కాదు నోరా ఫతేహి. ఈమె తెలుగులో ‘టెంపర్’ ‘కిక్2’, ‘లోఫర్’, ‘ఊపిరి’ లాంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు చేసింది. ఇటూ తెలుగులో చేస్తూనే హిందీలో కూడా అదరకొడుతుంది. అందులో భాగంగా.. సల్మాన్ ఖాన్ సినిమా ‘భారత్’ లో కనిపించింది. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు నోరా ఫతేహి.
మోడల్, డ్యాన్సర్, నటి, రియలిటీ షోకు జడ్జిగా, సింగర్, ఇలా ఒకటి రెండు కాదు అన్ని రంగాల్లో తనదైన శైలి లో దూసుకుపోతుంది. ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయిన సరే తన సైల్లో చాల ఈజీ గా చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. బాలీవుడ్లో తన సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు లో కూడా చాల సినిమాలే చేసింది. టెంపర్, లోఫర్, కిక్2, ఊపిరి చిత్రాల్లో చిందులువేసిన నోరా ఫతేహి..
పాన్ ఇండియన్ సినిమా బాహుబలి లో ‘మనోహరి’ పాటలోనూ తన డాన్స్ తో ఆకట్టుకుంది. నోరా ఫతేహి రిలీజ్ చేసిన డాన్స్ వీడియో లు సోషల్ మీడియాలో కొద్ది క్షణాల్లోనే ట్రెండింగా మారిపోతున్నాయి అంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ బ్యూటీ మరో డాన్స్ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సమ్మర్ టైం అంటూ నోరా ఫతేహి చేసిన ఈ డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది.