వినాయకుడి పూజా సమయంలో ముఖ్యంగా చేయకూడని పనులు, మరియు చేయాల్సిన పనులు…..

 

వినాయకుడి పూజా సమయంలో ముఖ్యంగా చేయకూడని పనులు, మరియు చేయాల్సిన పనులు…..


వినాయకుడి పూజా సమయంలో ముఖ్యంగా చేయకూడని పనులు, మరియు చేయాల్సిన పనులు…..

 

వినాయక చవితి అంటే చిన్న పిల్లల నుండి పండు ముసలిదాక అందరికి ఎదో తెలియని ఆనందం. వినాయక చవితి వస్తుందంటేనే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వినాయకుడిని కూర్చోబెట్టినప్పటి నుండి  పాటలు, ఆటలు, పాటలు, పూజలు అంత అన్నందాన్ని కలిగిస్తాయి…… కాబట్టి. హిందూ సంప్రదాయం ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వినాయక చవితిని ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువులు ఘనంగా జరుపుకుంటారు.

       ఈ సంవత్సరంలో కూడా  2021లో సెప్టెంబర్ 10వ  తేదీన అంటే శుక్రవారం నాడు వినాయక చవితి  పండుగ వచ్చింది. కరోనా మూడో దశ ముప్పు ఉన్న కారణంగా ఈ ఏడాది కూడా చాలా మంది ఇళ్లలోనే వినాయక చవితి పూజను జరుపుకోవాలని అధికారులు సూచించారు కాబట్టి చాలా మంది ఈ సారి తమ తమ ఇంట్లోనే వినాయకుడిని ప్రతిష్టించాలని అనుకుంటున్నారు.

            హిందూ శాస్త్రాల ప్రకారం వినాయకుని విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంట్లో ప్రతిష్టించాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం పెరుగుతాయని చాలా మంది చెబుతున్నారు…….

           కొంత మందికి పూజా సమయంలో ఎం ఎం చెయ్యాలి అనేది అస్సలు తెలియదు. కాబట్టి వినాయకుడి విగ్రాహాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూజ చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. వీటిని అస్సలు మరచిపోకూడదు. లేదంటే మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఇంట్లో గణేష్ పూజ చేసే సమయంలో ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

పూజకు ముందు..

         మన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించే ముందు  మన ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. పర్యావరణానికి అనుకూలమైన మట్టితో తయారు చేసిన, వినాయకుని తొండం ఎడమవైపునకు తిరిగి ఉన్న వినాయకుడిని తీసుకొచ్చి పెట్టాలి.  అయితే కుడివైపునకు తిరిగి ఉన్న తొండం ఉన్న వినాయకుడిని తీసుకోవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే దానికి కూడా అశుభ ఫలితాలు కలుగుతాయని చాల మంది నమ్ముతారు….. కావున తీసుకునేటప్పుడు  కూడా పూజారులని అడిగి, తెలుసుకొని తీసుకోవాలి…….

పూజ చేసేటప్పుడు…..

      సంప్రదాయం ప్రకారం…… వినాయకుడిని ఇంట్లోకి తెచ్చే టప్పుడు ఏదైనా వస్త్రంతో తలను కప్పి ఉంచాలి. పూజ ప్రారంభించేంత వరకు అది తీయకూడదు. పూజ సమయంలో పూజ ప్రారంభించేటప్పుడు కొంత మంచి నీటితో వినాయకుడి విగ్రహాన్ని కడగాలి. శుభ్రం చేసిన తర్వాత  ఎరుపు రంగు గంధపు తికాలన్ని గణపతి నుదుటిపై ఉంచాలి. అనంతరం విఘేశ్వరుని పవిత్ర మంత్రాలు పఠించాలి. మంత్రాలు చదువుతూ పూజను ప్రారంభించాలి. అయితే విగ్రహాన్ని మీ ఇంట్లో ఒకటిన్నర రోజు, మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు, పది రోజులు లేదా నిమజ్జనం వరకు ఇంట్లో ఉంచుకోవచ్చు. కొంతమంది మూడు రోజులు, కొంతమంది 5 రోజులు, కొంతమంది నిమర్జనంవరకు కూడా ఉంచుకుంటారు…….కాబట్టి మీరు నిమర్జనం వరకు కూడా ఉంచుకోవచ్చు……

ఉంచవలసినవి……….

   పూజ చేసే సమయంలో ఐదు రకాల పండ్లు, పంచామృతంతో పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే వినాయకుడి పూజ సమయంలో వినాయకుడికి  ఇష్టమైన ఉండ్రాళ్లు, గరిక, కొబ్బరికాయ, వెలగకాయ, లడ్డు, వంటి నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి. అలాగే దీపారాధన కూడ చేయాలి. బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలతో నివేదన చేయాలి. కొంతమంది పండ్లు ఫలహారాలతో  కూడా నివేదన చేస్తారు……. ఈ పనులు చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని నుపుణులు చెబుతున్నారు……

వినాయకుడిని ఉంచకూడని  ప్రదేశాలు ………

          వినాయకుడిని ఇంట్లో పెట్టుకునేటప్పుడు  చాల మంది తప్పులు చేస్తుంటారు…. అలాంటి వాళ్ళు కొన్ని కొన్ని పనులు తెలుసుకొని చేస్తే మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాన్ని అస్సలు ఉంచకూడదు. ఇంటి మెయిన్ గేటుకు ఎదరుగా, ఇంట్లోకి ప్రవేశించే మార్గం సమీపంలో వినాయకుని విగ్రహం ఉంచకూడదు. అలాగే వినాయకుని విగ్రహం బాత్ రూమ్ గోడ సమీపంలో, హాలులో కూడా వినాయక విగ్రహాన్ని ఉంచి పూజ చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు, ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. అందువలన వినాయకుడిని పెట్టుకునే ముందు తెలుసుకొని పెట్టండి……. చెడు ప్రదేశాలలో ఉంచి పూజ చేయకూడదు. కాబట్ట్టి మంచి పరిశుభ్రంగా ఉండే ప్రదేశాల్లో ఉంచి పూజ చెయ్యడం మంచిది………

చేయకూడని పనులు……..

           చాల మంది వినాయకుడి బొమ్మ బాగుంటే కొనుక్కోవాలని అనుకుంటారు. అలాగే వాళ్ళకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటారు…. కానీ ఎలాంటి బొమ్మలను కొనుక్కోవాలి అనేది ఎవ్వరికి తెలియదు. అలా చెయ్యడం కొన్ని చెడు ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి చాల మంది అంటున్నారు. కాబట్టి   మీ ఇంట్లో నాట్యం చేస్తున్నట్లు ఉన్న వినాయక విగ్రహాన్ని పొరపాటున కూడా ఉంచుకోవద్దు. అలాగే ఇలాంటి విగ్రహాలను ఎవ్వరికీ గిఫ్టుగా కూడా ఇవ్వకూడదట. నాట్యం చేస్తున్న వినాయక విగ్రహం ఉంటే, ఆ ఇంట్లో నిత్యం గొడవలు, వివాదాలు వచ్చే అవకాశం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అలాగే ఎవరైనా పెళ్లి సందర్భంగా వినాయక విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వకూడదట. మీ ఇంట్లో విగ్రహాన్ని నేరుగా మీరు నిమజ్జనం చేయకండి. పెద్ద పెద్ద విగ్రహాలు ప్రతిష్టించిన చోటకు వెళ్లి ఇవ్వండి. అలాగే వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో అలంకరణలు తీసేయండి. అలా చెయ్యకూడని పనులు చెయాడం మంచిది కాదని చాల మంది అంటుంటారు…….

దానాలు- ధర్మాలు…….  

         హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క రోజు ఇష్టమైన రోజు ఉంటుంది. అలాగే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం. కాబట్టి  ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు దాన ధర్మాలు చేస్తే అంతా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు…… అలాగే  వినాయక చవితి రోజున  గోమాతను కూడా పూజిస్తే మీ సమస్యలు తొలగిపోతాయని.. మీరు ఎలాంటి పోటీలో అయినా విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు. అలాగే మీ సమస్యలు మరియు మీ కుటుంభసమస్యలు కూడా  తొలగిపోతాయి అని అంటున్నారు……

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad