యూరిన్
రంగు మారిందా?
అయితే ఆ వ్యాధి ఉన్నట్టే!
మానవుడి శరీరంలో
ఉత్తత్తి చేసే వ్యర్థ పదార్థాలలో మూత్రం ఒకటని అందరికీ తెలుసు. అసలు మూత్రం ఎందుకు
వస్తుంది?
ఎలా వస్తుందో తెలుసా? కిడ్నీలు రక్తాన్ని
వడబోయగా అందులో ఉండే వ్యర్థ పదార్థాలు మూత్రంగా వస్తాయి. అనారోగ్య సమస్యలను
నివారించేందుకు వైద్యులు ముందుగా యూరిన్ టెస్ట్ చేస్తారు. మూత్రం రంగును బట్టి
శరీరంలోని వ్యాధులు తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
1. గోధుమరంగులో మూత్రం
వస్తుంటే.. లివర్ సంబంధ వ్యాధితో బాదపడుతున్నారని అర్థం. కాబట్టి వెంటనే
వైద్యుడుని సంప్రదించి తగు చికిత్సలు తీసుకోవడం మంచిది.
2. చాలామంది ఆరోగ్య సంబంధిత టాబ్లెట్స్ వాడుతుంటారు. విటమిన్, క్యాన్సర్ ట్యాబ్లెట్లు లాంటివి వాడడం వల్ల మూత్రం నీలం రంగు లేదా ఆకుపచ్చ రంగులో వస్తాయి. మూత్రం ఇలా వస్తే, జన్యుపర వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
3. గులాబీ లేదా ఎరుపు రంగులో మూత్రం వస్తే మూత్రపిండ వ్యాధులు, కణతులు, లివర్ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు వచ్చే ప్రమాదాలున్నాయి. అలాకాకుండా ఎరుపు, పింక్ రంగులో ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకున్నా కూడా రంగు మారే అవకాశాలున్నాయి.

4. ముదురు పసుపు, కమలాపండు రంగులో మూత్రం వస్తుంటే.. పెద్దగా ఆలోచనలో పడాల్సిన అవసరం లేదు. లివర్ వ్యాధులు ఉన్నాయని నిర్థారించుకోవచ్చు. శరీరంలోని తేమను బట్టి కూడా ఇలా జరుగుతుంది.
5. మూత్రం తేనె రంగులో కనిపిస్తే.. డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉందని అనుకోవచ్చు. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో వేడి ఎక్కువై యూరిన్ రంగు మారుతుంటుంది. దీనికి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ శాతం నీరు తీసుకుంటే సరిపోతుంది. లేతపసుపు రంగులో మూత్రం ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం.