క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్‌..

క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్‌..

ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ తాజాగా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ షాక్ ఇచ్చింది. జీరో బ్యాలన్స్ అకౌంట్ కలిగినవారికి చార్జీల మోత మోగనుంది. బ్యాంక్ తాజాగా జీరో బ్యాలన్స్ అకౌంట్ హోల్డర్స్‌ పై రూ. 100 నుంచి రూ. 125 వరకు చార్జీలు విధించింది. అక్టోబర్ 16 నుంచి ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 125 వరకు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతుంది.
తొలి రెండు లావాదేవీలకు రూ. 100 చార్జి పడుతుంది. తర్వాత ట్రాన్సాక్షన్‌లకు రూ. 125 చెల్లించాల్సి ఉంది. అలాగే బ్యాంక్ క్యాష్ డిపాజిట్ల పై కూడా ఇదే రకమైన చార్జీలు వసూలు చేయనుంది. ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్, యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను వసూలు చేయడం లేదు. మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ మార్గంలో ట్రాన్సాక్ష‌న్ల‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. అదే బ్యాంకుకు వెళ్లి నెఫ్ట్‌ సేవలు వినియోగించుకుంటే చార్జీలు చెల్లించాల్సిందే.
ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌ల్లో ఇప్పుడు నెఫ్ట్ ట్రాన్సాక్షన్ ఫీజు రూ. 2.25 నుంచి రూ. 24.75 మధ్యలో ఉంది. ఇక టిఆర్‌టీజీఎస్ లావాదేవీల విషయానికి వస్తే చార్జీలు రూ. 20 నుంచి రూ. 45 మధ్యలో ఉన్నాయి. వీటీకి జిఎస్టీ అదనం. డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ఒక నోటిఫికేషన్ లో పేర్కొంది. కారణం ఏదేమైనా చార్జీల బాదుడులో బ్యాంక్ ఖాతాదారుల న‌డ్డి విర‌గ‌డం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad