ధ్వజ స్తంభం చరిత్ర, విశిష్టత


ధ్వజస్తంభం విశిష్టత తెలుసా !

ధ్వజస్తంభం ఏదైనా హిందూ దేవాలయాలకు వెళ్ళినపుడు మనకు మొదటగా ఇవే కనబడుతాయి. మొట్ట మొదటగా భక్తులు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తరువాత దైవ దర్శనం చేసుకుంటారు. ఇది పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారంఈ ధ్వజస్తంభం ఆలయానికి హృదయం వంటిది. 

 అసలు విషయంలోకి వెళితే ఒకప్పుడు బాటసారులు అడవిలో దారి మర్చిపోయి గమ్యం సాగిస్తూ ఉండేవారు.  ధ్వజస్తంభం ఎత్తుగా ఉండటం వలన దానిపై వెలిగించిన దీపం వారికి కనపడి అది గుడి అని గ్రహించి ఆ గుడికి కానీ, ఆ పల్లెకు కానీ వెళ్లి అక్కడ తలదాచుకొనేవారు. ధ్వజస్తంభం పిడుగుల నుండి రక్షించేదిగా ఉంటుంది. ప్రజలు కార్తీకమాసములో ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుని ఆరాధిస్తూ ఉంటారు. 

 ధ్వజస్తంభం తలపై ధ్వజస్తంభ వాహక దేవత ప్రతిష్టించబడి ఉంటుంది. ధ్వజస్తంభం పైన కుండలినీశక్తిని ముద్రించిన పతాకం ఏర్పరచబడి ఉంటుంది. ఆలయంలో ఉండే దైవం ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. దేవాలయాలలో దేవునికి నిత్యహారతులు  జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. ధ్వజస్తంభానికిదీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు కూడా చేయాలి. దేవుడు కొలువు ఉండే గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు….

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad