శుక్ర, మంగళ వారాల్లో ఎవరికైనా డబ్బు ఇస్తే ఏమౌతుంది..?


శుక్ర, మంగళ వారాల్లో ఎవరికైనా డబ్బు ఇస్తే ఏమౌతుంది..?
శుక్ర, మంగళ వారాల్లో ఎవరికైనా డబ్బు ఇస్తే ఏమౌతుంది..?

మహాలక్ష్మీ దేవి భృగుమహర్షి కుమార్తె. శుక్రవారం రోజున శ్రీమహాలక్ష్మిని కొలుస్తారు కాబట్టి.. శుక్రావారాన్ని భృగువారం అని కూడా అంటారు. ఇక.. మంగళవారం అనేది కుజగ్రహానికి చెందినది. మంగళ అంటే ఆరోజు మంగళం జరుగుతుంది అని అర్థం కానీ.. అమంగళం కాదు. శుక్రవారం, మంగళవారం నాడు ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా డబ్బులు ఇచ్చినా అవి తిరిగి రావని.. డబ్బులు ఇచ్చిన వారు, తీసుకున్నవారి మధ్య గొడవలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు.

కానీ.. అదంతా ఉత్తిదేనని పండితులు అంటున్నారు. అది అశాస్త్రీయమైన వాదన అంటూ కొట్టిపారేస్తున్నారు. మంగళ, శుక్రవారాల్లో అప్పులు తీర్చినా.. అప్పులు ఇచ్చినా.. వేరే వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టినా.. ఇలా ఏం చేసినా ఏం కాదట. ఎందుకంటే.. శుక్రవారం అంటేనే లక్ష్మీ వారమని.. ఆరోజు డబ్బు వేరే వాళ్లకు ఇస్తే అది తిరిగి రాదు అనేది అపనమ్మకం అని అంటున్నారు. మంగళవారం కూడా మంగళమే కాని.. అమంగళమేమీ కాదు 

కాబట్టి నిరభ్యంతరంగా ఖర్చు పెట్టొచ్చని చెబుతున్నారు. మంగళవారం, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదని ప్రజల్లో కావాలని కొందరు వదంతులు సృష్టిస్తున్నట్టు పండితులు చెబుతున్నారు. అసలు ఆ రెండు రోజులు ఎందుకు డబ్బులు వేరేవాళ్లకు ఇవ్వకూడదో సరైన కారణాన్ని మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారంటూ పండితులు మండిపడుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad